Tirumala Devotees Clash : తిరుమల క్యూలైన్‌లో భక్తుల మధ్య ఘర్షణ.. గుంటూరుకి చెందిన భక్తులపై తమిళనాడు భక్తుల దాడి

తిరుమల దర్శనం క్యూలైన్ లో ఒక్కసారిగా గొడవ మొదలైంది. భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. గుంటూరుకి చెందిన భక్తులపై తమిళనాడు భక్తులు దాడికి పాల్పడ్డారు.

Tirumala Devotees Clash : తిరుమల క్యూలైన్‌లో భక్తుల మధ్య ఘర్షణ.. గుంటూరుకి చెందిన భక్తులపై తమిళనాడు భక్తుల దాడి

Updated On : October 11, 2022 / 12:10 AM IST

Tirumala Devotees Clash : తిరుమల దర్శనం క్యూలైన్ లో ఒక్కసారిగా గొడవ మొదలైంది. భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. గుంటూరుకి చెందిన భక్తులపై తమిళనాడు భక్తులు దాడికి పాల్పడ్డారు. దాడి ఘటనకు సంబంధించి టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల ఏరియాలోని క్యూలైన్ లైన్ లో దర్శనానికి వెళ్లే రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ముందూ, వెనుక వెళ్లే విషయంలో ఒకరినొకరు తోసుకోవడంతో గొడవ మొదలైంది. తమిళనాడు, గుంటూరుకి చెందిన భక్తుల మధ్య గొడవ జరిగింది. వీరి మధ్య గొడవ చినికి చినికి గాలి వానలా మారి క్యూలైన్ లోనే కొట్టుకునే దాకా వెళ్లింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

నిత్యం గోవింద నామ స్మరణతో మారుమోగే చోట ఈ విధంగా గొడవలు జరగడం ఇతర భక్తులను కూడా చాలా ఇబ్బంది పెట్టింది. వెంటనే అక్కడున్న విజిలెన్స్ సిబ్బంది గుర్తించి వారిని వెలుపలకు తీసుకొచ్చి విచారణ చేశారు. కాగా, క్యూలైన్ లో తరుచుగా ఇలాంటి ఘటనలో చోటు చేసుకుంటున్నాయి. భక్తులు సంయమనం కోల్పోయి ఈ రకంగా గొడవలు పడుతుండటం తోటి భక్తులతగ ఇబ్బందికి గురి చేస్తోంది.