విద్యార్థులకు అలర్ట్.. ఏపీలో పదోతరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు ముఖ్య గమనిక. పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు ముఖ్య గమనిక. పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు.
ఇంటర్ పరీక్షల విషయానికి వస్తే.. మార్చి 1 నుంచి 19 వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలను, మార్చి 3 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మంచి మార్కులు సాధించేందుకు ప్రయత్నించాలని ఈ సందర్బంగా మంత్రి సూచించారు. పరీక్ష రాసే విద్యార్థులు అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
పదో తరగతి షెడ్యూల్ ఇదే..
ఇంటర్ పరీక్షల షెడ్యూల్..
మార్చి 1 నుంచి 19 వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, మార్చి 3 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.