సచివాలయంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ

ఏపీ సెక్రటేరియట్ లోని ఫస్ట్ బ్లాక్ లో ఉన్న చంద్రబాబుని కలిశారు పవన్ కల్యాణ్. సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ మాట్లాడుకున్నారు.

సచివాలయంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ

Updated On : June 18, 2024 / 7:25 PM IST

Pawan Kalyan Meet CM : డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్లిన పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు పవన్. అంతకుముందు పవన్ కు సాదరంగా ఆహ్వానం పలికారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి సెక్రటేరియట్ లోని తన చాంబర్ కు వచ్చిన పవన్ కల్యాణ్ ను సీఎం చంద్రబాబు ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. పవన్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ సీఎం ను కలిశారు.

ఏపీ సెక్రటేరియట్ లోని ఫస్ట్ బ్లాక్ లో ఉన్న చంద్రబాబుని కలిశారు పవన్ కల్యాణ్. సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ మాట్లాడుకున్నారు. దాదాపు గంట సేపు మాట్లాడుకున్నారు. పాలనకు సంబంధించిన అనేక విషయాలపై ఇరువురూ డిస్కస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పాలనకు సంబంధించిన అంశాలతో పాటు తన శాఖలకు సంబంధించి వ్యవహారాలపైనా చంద్రబాబుతో పవన్ డిస్కస్ చేసినట్లు సమాచారం. గ్రామాల్లో పూర్తి స్థాయి అభివృద్ధి చెందాలంటే దానికి పకడ్బందీ ప్రణాళిక అవసరం.

రేపు సచివాలయంలో పవన్ కల్యాణ్ తన చాంబర్ లో ఏ సమయంలో బాధ్యతలు తీసుకుంటారు అనేదానిపై జనసేన నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read : ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్