కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. వచ్చీ రాగానే ముందుగా ఎక్కడికి వెళ్లారో, ఏం చేశారో తెలుసా..

ఇప్పటివరకు ఏం జరిగింది? ఇంకా ఎంత పెండింగ్ ఉంది? ఇంకా ఎంత ఖర్చయ్యే అవకాశం ఉంది? ఎన్ని రోజులు అయ్యే అవకాశం ఉంది?

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. వచ్చీ రాగానే ముందుగా ఎక్కడికి వెళ్లారో, ఏం చేశారో తెలుసా..

Cm Chandrababu Kuppam Tour : ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలోనే పర్యటించనున్నారు చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా పర్యటిస్తున్నారు. హంద్రీ-నీవా కుప్పం బ్రాంచ్ కాలువను చంద్రబాబు పరిశీలిస్తున్నారు.

కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలం జెల్లిగానిపల్లె వద్ద ఉన్న హంద్రీనీవా ప్రాజెక్ట్ కుప్పం బ్రాంచ్ కెనాల్ ను సందర్శించారు. సొంత నియోజకవర్గం కుప్పంకి వెళ్లిన చంద్రబాబు.. ఫస్ట్ ప్రయారిటీగా నేరుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిశీలన కోసం వెళ్లారు. కృష్ణమ్మను కుప్పం వరకు తీసుకురావాలన్న బృహత్తర ప్రాజెక్ట్ ను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టారు. 90శాతం పనులు పూర్తైనా అనేక కారణాల వల్ల మిగిలిన 10శాతం పనులు గడిచిన ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు కుప్పం వచ్చీ రాగానే నేరుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పరిశీలిస్తున్నారు. పనులు ఎక్కడి వరకు వచ్చాయి? మట్టి పని ఎంత వరకు వచ్చింది? నేరుగా కాలువ వద్దకు వెళ్లి అన్ని అంశాలను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు కుప్పం బ్రాంచ్ కెనాల్ స్థితిగతులను చంద్రబాబుకు వివరిస్తున్నారు. ప్రాజెక్ట్ స్వరూపం, ఇప్పటివరకు ఏం జరిగింది? ఇంకా ఎంత పెండింగ్ ఉంది? ఇంకా ఎంత ఖర్చయ్యే అవకాశం ఉంది? ఎన్ని రోజులు అయ్యే అవకాశం ఉంది? ఇలాంటి అనేక అంశాలను ఇరిగేషన్ అధికారులను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకుంటున్నారు.

Also Read : బొత్స కుటుంబం ఇక ఇంటికే పరిమితమా? ఘోర ఓటమికి ప్రధాన కారణం అదేనా?