రాజధాని నిర్మాణం ఎలా.. కన్‌స్ట్రక్షన్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం
టెండర్ల కాలపరిమితి ముగియడంతో కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించారు.

Amaravati Construction : రాజధాని నిర్మాణంపైన ఏపీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. అమరావతి నిర్మాణాలకు సంబంధించి కన్ స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. గతంలో అమరావతి నిర్మాణంలో పాలు పంచుకున్న కన్ స్ట్రక్షన్ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు నిర్మాణ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. టెండర్ల కాలపరిమితి ముగియడంతో కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించారు. రాజధాని అమరావతిలో నిలిచిపోయిన పనుల కొనసాగింపునకు ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై డిస్కస్ చేశారు.
రెండున్నరేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు సర్కార్ చెబుతోంది. ఈ క్రమంలో అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాల కొనసాగింపుపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ఇవాళ చంద్రబాబు సమావేశం అయ్యారు. మళ్లీ నిర్మాణాలు ఏ విధంగా చేపట్టాలి అనేదానిపై ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఈ సమావేశంలో కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధుల సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు.
టీడీపీ ప్రభుత్వం హయాంలో రాజధాని పనులు సజావుగా సాగాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఐదేళ్లలో అక్కడ నిర్మాణాలు ఆగిపోయాయి. ముళ్లపొదలు పెద్ద ఎత్తున మొలిచాయి. ఆ ప్రాంతం అడవిని తలపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ ముళ్లపొదలను జేసీబీలతో తొలగించేశారు. రోడ్లు కూడా చాలావరకు దెబ్బతిన్నాయి. ముళ్లపొదలు రోడ్లను కప్పేశాయి. ఇప్పుడా రోడ్లను పునర్ నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఉది. చాలా చోట్ల ఫౌండేషన్లు దెబ్బతిన్నాయి. నీటలో మునిగి, స్టీల్ తుప్పు పట్టి పాడైపోయాయి. వీటికి సంబంధించి రీటెండర్లు వేసే అవకాశం ఉంది. దీనిపై అధికార యంత్రాంగంతో సమాలోచనలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read : లక్ష్యం కీలక పదవులు, శాఖలు కాదు.. టీడీపీ ప్రభుత్వం అసలు టార్గెట్ ఇదే