సీఎం చంద్రబాబుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..
బుడమేరు ప్రవాహం సరిగా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు చంద్రబాబు. అదే సమయంలో ట్రైన్ రావడంతో అంతా ఆందోళనకు గురయ్యారు.
Cm Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మధురానగర్ రైల్వే ట్రాక్ పైకి చంద్రబాబు వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో ట్రాక్ పైకి ట్రైన్ వచ్చింది. రైలు చూసి వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబును ఆపారు. చంద్రబాబుకు అతి సమీపం నుంచి రైలు వెళ్లింది. బుడమేరు ప్రవాహం సరిగా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు చంద్రబాబు. అదే సమయంలో ట్రైన్ రావడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. అయితే, రైలు నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లైంది. సీఎం చంద్రబాబు సేఫ్ గా ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
రోజూలాగే ఇవాళ కూడా సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న సహాయక కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. ఈ ఉదయం కూడా ఆయన నిడమానూరు ప్రాంతంలో బుడమేరుకు పడిన గండిన పరిశీలించేందుకు వెళ్లారు. ఆ తర్వాత విజయవాడ సిటీలో ఉండే మధురానగర్ వెళ్లారు. ఈ సమయంలోనే చంద్రబాబుకు వెంట్రుక వాసిలో పెను ప్రమాదం తప్పింది. వరదల పరిస్థితిని, బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు రైలు వంతెనపైకి కాలి నడకన వెళ్లారు.
భద్రతా సిబ్బంది వారించినా.. ఆయన వినలేదు. అలాగే రైలు వంతెనపైకి వెళ్లారు. కింద నుంచి చూస్తే బుడమేరులో వరద ప్రవాహం కనిపించలేదు. దీంతో ఆయన రైల్వే ట్రాక్ పై నుంచి పరిశీలన చేసేందుకు వెళ్లారు. రైలు వంతెనపై నడుస్తుండగా.. సడెన్ గా ఎదురుగా ట్రైన్ వచ్చింది. చంద్రబాబుకు అతి సమీపం నుంచి రైలు వెళ్లింది. రైలు తగలకుండా పక్కగా నిలబడంతో చంద్రబాబుకు పెద్ద ప్రమాదమే తప్పింది. ట్రైన్ కి, చంద్రబాబు మధ్య చాలా తక్కువ గ్యాపు ఉంది. రైలు దాటి వెళ్లాక సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
Also Read : వరద తగ్గాక.. ఆ ఆరుగురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోనున్న సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా..
ప్రాణాలకు తెగించి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రైలు వంతెనపైకి ఎక్కారు. అదే సమయంలో ట్రైన్ దూసుకొచ్చింది. ట్రైన్ రాకను గమనించిన చంద్రబాబు ఆఖరి నిమిషంలో అలర్ట్ అయ్యారు. చంద్రబాబు, సెక్యూరిటీ సిబ్బంది అంతా ట్రాక్ పక్కన నిల్చున్నారు. ట్రైన్ వారి పక్క నుంచి వెళ్లింది. తృటిలో పెద్ద గండం తప్పిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. వరద బాధితుల కోసం చంద్రబాబు నిద్రాహారాలు మాని పని చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది వారించినా వినకుండా నీళ్లలో తిరుగుతున్నారు. ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోతున్నారు. ప్రజలు కష్టపడుతుంటే చూస్తూ ఉండలేనని చంద్రబాబు చెబుతున్నారు.