RTC Bus : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు గుడ్‌న్యూస్.. ఇక హాయిగా వెళ్లొచ్చు..

RTC buses : ఏపీలోని బస్సుల్లో ప్రయాణంచేసే పురుషులకు ఇదొక గుడ్‌న్యూసేనని చెప్పొచ్చు. ఎందుకంటే.. ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో

RTC Bus : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు గుడ్‌న్యూస్.. ఇక హాయిగా వెళ్లొచ్చు..

EV buses

Updated On : December 2, 2025 / 8:05 PM IST

RTC buses : ఏపీలోని బస్సుల్లో ప్రయాణంచేసే పురుషులకు ఇదొక గుడ్‌న్యూసేనని చెప్పొచ్చు. ఎందుకంటే.. ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో కావాల్సిన సంఖ్యలో బస్సులు అందుబాటులో లేవు. ఉన్న బస్సుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో అధికశాతం మంది మహిళలు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు బస్సులనే ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా బస్సులపై ఆధారపడి ప్రయాణం చేసే పురుషులు బస్సుల్లో రద్దీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఇకనుంచి ఆ సమస్య తీరే అవకాశం కనిపిస్తుంది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం సచివాలయంలో విద్యుదుత్పత్తి, పంపిణీలో వ్యయం తగ్గింపుపై అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ భవనాలపై విస్తృత స్థాయిలో సౌర విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి, ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది ప్రోత్సాహకాలు కొనసాగించాలన్నారు. అదే సమయంలో ఆర్టీసీకి త్వరలోనే వెయ్యి ఈవీ బస్సులు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో 5వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని, ఎనర్జీ రంగంలో ఒప్పందాలు 60రోజుల్లో కార్యరూపం దాల్చాలని అధికారులకు సూచించారు.

గత ప్రభుత్వం పీపీఏల రద్దుతో ప్రజలపై రూ.9వేల కోట్ల భారం మోపిందని విమర్శించిన చంద్రబాబు.. విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో భారాన్ని జీరో చేశామని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఎంవోయూలు చేసుకోవాలని, ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల్లోనూ విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.