CM Chandrababu Naidu : ఏపీలోని మహిళలకు మరో శుభవార్త.. కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు
AP Free AC Buses : ఏపీ ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మహిళలకు మరో శుభవార్త చెప్పారు.
CM Chandrababu Naidu
AP Free AC Buses: ఏపీలోని సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. నూతన పథకాలు అమలు చేస్తూ వారికి ఆర్థిక చేయూతను అందిస్తోంది. దీనికితోడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను కూడా కల్పిస్తోంది. అయితే, మహిళకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక ప్రకటన చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి డ్వాక్రా సంఘాలను స్థాపించామని, మహిళల కోసం కూటమి ప్రభుత్వం అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటుందని వివరించారు. డ్వాక్రా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా చూస్తామని చెప్పారు. ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు.
కేంద్రం సహకారంతో రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు మేలుజరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ప్రతి రంగంలోనూ పురుషులతో సహా మహిళలు పోటీ పడుతున్నారని.. కొన్ని రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి.. వాటిని మహిళలు నడపాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
రవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు త్వరలోనే పెద్దఎత్తున ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కొన్ని రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని, వాటిని మహిళలు నడపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళలు ఇంటిపైన సోలార్ పెట్టుకుంటే విద్యుత్ తయారు అవుతుందని, దానిద్వారా కొన్ని రోజుల్లో ఉచితంగా కరెంటు పొందవచ్చునని తెలిపారు.
