Cm Chandrababu : రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలపై సీఎం చంద్రబాబు సీరియస్..

విధుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Cm Chandrababu : రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలపై సీఎం చంద్రబాబు సీరియస్..

CM Chandrababu Naidu

Updated On : December 5, 2024 / 4:34 PM IST

Cm Chandrababu : కృష్ణా జిల్లా రైతు భరోసా కేంద్రాల్లో జరిగిన అవకతవకలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి రికార్డుల్లో తప్పుడు లెక్కలు చూపించిన అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. కస్టోడియల్ ఆఫీసర్, టీమ్ లీడర్ ను (టీఏ) సస్పెండ్ చేశారు. విధుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

రైతుల నుంచి ధాన్యం సేకరించే విషయంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని సీరియస్ యాక్షన్ కు సంక్పలించారు. నిన్న టీడీపీ కార్యాలయంలో కొందరు మీడియా ప్రతినిధులు రైతులు ఏ విధంగా నష్టపోతోంది, పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే విచారణ జరిపించారు.

ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో రైతు భరోసా కేంద్రాల్లో ఏ విధంగా అవకతవకలు జరుగుతున్నాయి? అక్కడ టెక్నికల్ ఆఫీసర్, కస్టోడియల్ ఆఫీసర్ ధాన్యం సేకరణ విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారు.. రైతుల నుంచి తీసుకున్న ధాన్యం బదులు కొంత తక్కువ మోతాదులో లెక్కల్లో చూపిస్తున్నారు.. ఈ విధంగా రైతులకు అన్యాయం చేస్తున్నారు అంటూ స్థానిక రైతులు అభిప్రాయపడ్డారు.

ఈ విషయాన్ని మీడియా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే సీఎం చంద్రబాబు యాక్షన్ తీసుకున్నారు. విచారణ చేయించి బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పని చేయకుండా, రైతులను ఇబ్బంది పెడుతున్న పౌరసరఫరాల శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా హెచ్చరించారు.

 

Also Read : మంత్రులు ఎమ్మెల్యేలకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏంటి? ఈ కొత్త ట్రెండ్ చంద్రబాబు ఎందుకు స్టార్ట్ చేసినట్లు?