రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్.. ఆ ముగ్గురు ఎవరంటే?
త్వరలో ఖాళీకానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తరపున అభ్యర్థులను ఖరారు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

YS Jagan
YSRCP Rajyasabha Candidates: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సర్వేలు ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. దీంట్లో భాగంగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించారు. కొంతమంది సిట్టింగులకు సీట్లు దక్కలేదు. ఇదిలావుంటే మూడు రాజ్యసభ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేశారు సీఎం జగన్.
త్వరలో ఖాళీకానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, జంగాలపల్లి శ్రీనివాసులను అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. గొల్ల బాబూరావు ఎస్సీ, జంగాలపల్లి శ్రీనివాస్ బలిజ సామాజిక వర్గాలను చెందిన వారు. రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పదవీ కాలం త్వరలో ముగియనుంది.
ప్రస్తుతం గొల్ల బాబూరావు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. జంగాలపల్లి శ్రీనివాసులు చిత్తూరు శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ గా గతంలో పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జిగా ఉన్నారు.
Also Read: వైసీపీ లోక్‌సభ అభ్యర్థులు వీళ్లే? గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాత్మక అడుగులు..