cm Jagan మామ గంగిరెడ్డి కన్నుమూత

  • Published By: madhu ,Published On : October 3, 2020 / 06:49 AM IST
cm Jagan మామ గంగిరెడ్డి కన్నుమూత

Updated On : October 3, 2020 / 7:20 AM IST

cm Jagan : సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.



ఆరోగ్యం విషమించి..2020, అక్టోబర్ 02వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి గంగిరెడ్డి కన్నుమూశారు. గంగిరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులుగా పేరొందారు. అంతేకాదు..రాజకీయాల్లో ప్రవేశించారు. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పని చేశారు.



ఇటీవలే తిరుపతికి వెళ్లిన సీఎం జగన్ ప్రత్యేక విమానంలో రేణిగుంట నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మామ గంగిరెడ్డిని పరామర్శించిన సంగతి తెలిసిందే.