రాజధాని మార్పుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సంలో రాజధాని తరలింపుపై సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సంలో రాజధాని తరలింపుపై సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సంలో రాజధాని తరలింపుపై సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గతంలో అన్యాయంగా తీసుకున్న నిర్ణయాలను సరిచేస్తామని తెలిపారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజధాని ఆందోళన నేపథ్యంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రాంతాలు అన్నదమ్ముల్లా ఉండేలా చేస్తామని చెప్పారు. ఎప్పటికీ అనుబంధాలు నిలిచేలా చూస్తానని తెలిపారు. మీరిచ్చిన అధికారాన్ని, దేవుడి దయతో వచ్చిన ఈ పదవిని అందరికీ అభివృద్ధికి ఉపయోగిస్తానని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న రాజధానిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) నివేదిక సీఎం జగన్ చేతికి అందింది. శుక్రవారం(జనవరి3, 2020) బీసీజీ ప్రతినిధులు సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్ తో బీసీజీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని, రాష్ట్రాభివృద్ధిపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. ఆ నివేదికను 3.30 గంటలకు సీఎం జగన్ చేతికి ఇచ్చారు. బీసీజీ నివేదికలో ఏముంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానుల అంశం దుమారం రేపుతున్న నేపథ్యంలో అందరి చూపు బీసీజీ నివేదికపైనే ఉంది. ప్రజల్లోనే కాదు రాజకీయ నాయకుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
శుక్రవారం (జనవరి 3, 2020) పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాల రూపు రేఖలు ఫిబ్రవరి 1 నుంచి మార్చబోతున్నామని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ పథకానికి జవసత్వాలు నింపి, వినూత్న మార్పులతో కొత్త వ్యాధులు కలిపి మొత్తం 2,059 వ్యాధులకు చికిత్స అందించేలా రూపకల్పన చేశారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ కార్డు పంపిణీ తొలి రోజునే 1.5 లక్షల కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గతంలో పలు ఒడిదుడుకుల మధ్య 1059 వ్యాధులకు చికిత్స అందేదని దాన్ని మరింతగా పెంచుతు 2059 వ్యాధులకు పెంచామని తెలిపారు.
ఈ పథకం ద్వారా చికిత్స చేయించుకునీ లేదా ఆపరేషన్ చేయించుకున్నవారు విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా రోగికి నెలకు రూ.5వేలు అందిస్తామని తెలిపారు.ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు పూర్తి చికిత్సనందించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టామని వెల్లడించారు.