AP CM Jagan : అక్టోబర్ 26న రైతు భరోసా రెండో విడత
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Cm Jagan Review On Cyclone Gulab
AP CM Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణ ప్రగతి జగనన్న శాశ్వత గృహహక్కు పథకంపై సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఈ సందర్బంగా అధికారులకు సూచించారు సీఎం.
చదవండి : CM Jagan on TDP: టీడీపీపై జగన్ సీరియస్.. పోలీసులు ఎవర్నీ వదలొద్దన్న ఏపీ సీఎం..!
గ్రామ సచివాలయాలు, విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, ప్రగతి గురించి సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలపై కూడా ఈ సమీక్షలో సీఎం జగన్ చర్చించారు.
చదవండి : Jagananna Thodu : జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంపై సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ఎరువులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఇక శాంతిభద్రతల అంశంపై ఎస్పీలతో మాట్లాడారు సీఎం.