Jagananna Thodu : జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

'జగనన్న తోడు' పథకం కింద లబ్దిదారులకు వడ్డీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. రేపు(అక్టోబర్ 20,2021) ఉదయం సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రూ. 16.36

Jagananna Thodu : జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

Jagananna Thodu

Jagananna Thodu : ‘జగనన్న తోడు’ పథకం కింద లబ్దిదారులకు వడ్డీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. రేపు(అక్టోబర్ 20,2021) ఉదయం సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రూ. 16.36 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 9.05 లక్షల మందికి రూ. 950 కోట్ల రుణాలను అందించింది. తొలి విడత జగనన్న తోడు కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4.5 లక్షల మంది చిరువ్యాపారులకు లబ్ధి చేకూరనుంది.

వాస్తవానికి మంగళవారం(అక్టోబర్ 19,2021) జగనన్న తోడు కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ బుధవారానికి వాయిదా వేశారు. మిలాద్‌-ఉన్‌-నబీ పండగ సెలవు కావడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

Fasting : ఉపవాసంతో ఆరోగ్యానికి మేలే!…

ఏపీ ప్రభుత్వం జగనన్న తోడు పథకం ద్వారా తోపుడు బండ్లు, హస్తకళా వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందిస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఏటా రూ.10 వేలు వడ్డీ లేని రుణాలను అందజేస్తోంది. ఈ మొత్తానికి సంబంధించి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. సకాలంలో రుణాన్ని చెల్లించే వారికి తిరిగి రుణం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

Teeth : మిలిమిల మెరిసే దంతాల కోసం..

సీఎం జగన్‌ ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారు. అన్ని వర్గాల వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగా ‘జగనన్న తోడు’ పథకం తెచ్చారు. వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిరు వ్యాపారులకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకం తెచ్చింది. అయితే తీసుకున్న రుణం చెల్లిస్తేనే తిరిగి రుణం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. కరోనా కారణంగా రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయింది. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆదాయం తగ్గింది ఖర్చులు పెరిగాయి. అయినప్పటికి ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. లబ్దిదార్ధులకు ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నారు.