Fasting : ఉపవాసంతో ఆరోగ్యానికి మేలే!…

ఉపవాసం ఉన్న సమయంలో ఆటోపజీ ప్రేరేపించేందుకు కారణాలు లేకపోలేదు. తినటానికి ఆహారం అందుబాటులో లేని విషయం శరీరం మెదడుకు చేరవేస్తుంది. ఆసమయంలో మెదడు నిల్వ ఉన్న శక్తిని వినియోగించమని శరీరాన్ని అదేశిస్తుంది.

Fasting : ఉపవాసంతో ఆరోగ్యానికి మేలే!…

Fasting

Fasting : ఉపవాసాలు చేయటం చాలా మందికి అలవాటు. తమ తమ ఇష్టదైవాలకోసం చాలా మంది ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల శరీరమంతా నీరసించి పోయి ఆరోగ్యం దెబ్బతింటుందన్న భావనలో చాలా మంది ఉంటారు. అయితే జపాన్ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో ఉపవాసం చేయటం ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది. ఉపవాసం చేయటం వల్ల శరీరం తనని తాను శుభ్రం చేసుకోవటంతో పాటు కొత్త శక్తిని నింపుకుంటుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో తేల్చారు.

ఉపవాసం చేయటం వల్ల ఆటోఫజీ అనే కొత్త జీవక్రియ మెరుగవుతుందని జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఓషుమి చెప్పారు. ఉపవాసం వల్ల శరీరంలోని దెబ్బతిన్న కణాలు తమను తాము నాశనం చేసుకోవటం వల్ల గ్రోత్ హార్మోన్ వృద్ధి చెందిన కొత్త కణాల పుట్టేందుకు ప్రేరణకలుగుతుంది. దీనినే వైద్య పరిభాషలో ఆటోపజీ అంటారు.

ఆటోపజీ సమయంలో కొత్త కణాలు పుట్టుకొస్తూ పైపొరల్ని తయారు చేసుకునే క్రమంలో చనిపోయిన కణాలను వినియోగించుకుని వాటి మాలిక్యూల్స్ ని శక్తిగా వినియోగించుకుంటాయి. ఉపవాసం ఉండే వారిలో ఈ తరహా చర్య ఎక్కువగా జరుగుతుంది. అందేకే ఉపవాసం ఉన్న సమయంలో ఆరోగ్యపరమైన ప్రయోజనం కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఉపవాసం ఉన్న సమయంలో ఆటోపజీ ప్రేరేపించేందుకు కారణాలు లేకపోలేదు. తినటానికి ఆహారం అందుబాటులో లేని విషయం శరీరం మెదడుకు చేరవేస్తుంది. ఆసమయంలో మెదడు నిల్వ ఉన్న శక్తిని వినియోగించమని శరీరాన్ని అదేశిస్తుంది. ఆసందర్భంలో శరీర కణాలు శక్తికోసం , పాత ప్రొటీన్లపై దాడి చేస్తాయి.

ఇలా జరగటానికి కారణం కూడా ఉంది. ఆహారం శరీరానికి అందకపోతే ఇన్సులిన్ లెవెల్స్ పడిపోతాయి. దీంతో దానికి వ్యతిరేకమైన గ్లూగాన్ తన ప్రతాపాన్ని చూపించటం ప్రారంభిస్తుంది. శరీరంలో నిరర్ధకంగా పడిఉన్న కణాలపై గ్లూకాగాన్ దృష్టి కేంద్రీకరిస్తుంది. ఆసందర్భంలో గ్రోత్ హార్మోన్ ప్రేరేపితమై కొత్త కణాల తయారీకి పూనుకుంటుంది. అందేకే ఉపవాసం చేయటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.