CM Jagan : పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు.

CM Jagan
CM Jagan File Nomination : వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పులివెందులలో బహిరంగ సభ అనంతరం మినీ సెక్రటేరియట్ లోని ఆర్వో కార్యాలయంకు వెళ్లి అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. సీఎం జగన్ వెంట వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి ఉన్నారు.