ప్రకృతి కూడా ఆశీర్వదించింది: సంక్రాంతి వేడుకలకు సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్విటర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించిందంటూ ఆయన తెలిపారు.
రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
ఇక పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో ఇవాళ(14 జనవరి 2020) నిర్వహించనున్న సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు.
మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి, 3గంటల 45నిమిషాల నుంచి 4గంటల 45నిమిషాల వరకు గుడివాడలోని లింగవరం రోడ్ కే కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొంటారు. తిరిగి 5.35 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు జగన్.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది. రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి
ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.#Sankranthi2020— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2020