సంక్రాంతికి ఏపీలో కొత్త జిల్లాలు.. వేగం పెంచిన ప్రభుత్వం, అధికారులతో సీఎం జగన్‌ కీలక భేటీ

  • Published By: naveen ,Published On : November 16, 2020 / 11:40 AM IST
సంక్రాంతికి ఏపీలో కొత్త జిల్లాలు.. వేగం పెంచిన ప్రభుత్వం, అధికారులతో సీఎం జగన్‌ కీలక భేటీ

Updated On : November 16, 2020 / 12:15 PM IST

cm jagan new districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. అధికారంలోకి రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన వైసీపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాల పునర్విభజనపై అధికారులతో ఇవాళ(నవంబర్ 16,2020) సీఎం జగన్‌ సమీక్షించనున్నారు. కాసేపట్లో తాడేపల్లి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో అధికారులతో జగన్‌ భేటీ కానున్నారు. ఈ సమీక్ష సమావేశానికి చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని కూడా హాజరుకానున్నారు. జిల్లాల పునర్విభజనపై సీఎస్ కమిటీతో ఇప్పటికే జగన్‌ సమావేశం నిర్వహించారు.


https://10tv.in/ap-government-speed-up-process-of-new-districts-formation/
జిల్లాల పునర్విభజనపై కమిటీల అధ్యయనం దాదాపు పూర్తి:
సీఎస్ నీలం సాహ్ని నేతృత్వంలోని కమిటీకి తోడు నాలుగు సబ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాల పునర్విభజనపై కమిటీల అధ్యయనం దాదాపు పూర్తి అయింది. జిల్లా బౌండరీలు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి ఒక సబ్ కమిటీ… నిర్మాణాత్మకత, సిబ్బంది, పునర్విభజన అధ్యయనానికి రెండవ సబ్ కమిటీ… మౌలిక సదుపాయాల అధ్యయనం, ఆస్తుల అధ్యయనానికి మూడవ సబ్ కమిటీ… ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి నాలుగవ సబ్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని జగన్ ఇచ్చిన హామీలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సంక్రాంతి నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.