Vontimitta: నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణానికి హాజరుకానున్న సీఎం జగన్.. పర్యటన వివరాలు ఇలా..

వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో శుక్రవారం రాత్రి సీతారాముల కళ్యాణం జరగనుంది. టీటీడీ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో అంగరంగ వైభవంగా కల్యాణాన్ని ...

Vontimitta: నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణానికి హాజరుకానున్న సీఎం జగన్.. పర్యటన వివరాలు ఇలా..

Vantimitta

Updated On : April 15, 2022 / 9:40 AM IST

Vontimitta: వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో శుక్రవారం రాత్రి సీతారాముల కళ్యాణం జరగనుంది. టీటీడీ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో అంగరంగ వైభవంగా కల్యాణాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా కల్యాణం ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం కొవిడ్ ఆంక్షలు తొలిగిపోవడంతో లక్షలాది జనసంద్రోహం మధ్య జగదభిరాముడి జగత్ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు, ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. కళ్యాణోత్సవానికి సీఎం జగన్ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 8గంటల నుంచి ఉదయం 10గంటల వరకు కళ్యాణ ఘట్టం జరగనుంది. ఇదిలాఉంటే స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Vontimitta : ఒంటిమిట్ట రామాలయం.. బ్రహ్మోత్సవాలకు ముస్తాబు

ఇదిలాఉంటే కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన రెండు రోజులు సాగనుంది. 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి కడప ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. రాత్రి 7.20 గంటలకు టీటీడీ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి 7.40 గంటలకు కోదండరామస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సీతారాముల కల్యాణ వేదిక వద్దకు చేరుకుంటారు. రాత్రి 8గంటల నుంచి జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో జగన్ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలను అందజేస్తారు. అనంతరం రోడ్డు మార్గాన ఒంటిమిట్ట నుంచి బయలుదేరి రాత్రి 10.30 గంటలకు కడపలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి చేరుకొని అక్కడే బస చేస్తారు.

Vontimitta : ఏప్రిల్ 15న ఒంటిమిట్ట రామయ్య కల్యాణం.. టీటీడీ ఛైర్మన్ సమీక్ష

16న ఉదయం 9.10గంటలకు కడప ఎన్జీవో కాలనీలో నంద్యాల జూనియర్ కలెక్టర్ మౌర్య వివాహ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతారు. అనంతరం అక్కడి నుండి పాత బైపాస్‌లో ఉన్న ఆదిత్య కల్యాణ మండపానికి చేరుకుంటారు. 9.45 గంటలకు కడప నగర మేయర్ సురేష్ బాబు కుమార్తె ఐశ్వర్య వివాహ ముందస్తు వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుండి కడపకు ఎయిర్ పోర్టుకు చేరుకొని 10.10 గంటలకు ప్రత్యేక విమానంలో కర్నూల్ జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు వెళ్తారు.