ఇంగ్లీషును వద్దనే వారు..అంటరానితనాన్ని ప్రోత్సాహించడమే – సీఎం జగన్

YSR Sampoorna Poshana scheme : ఇంగ్లీషు భాషను వద్దనే వారు అంటరానితనాన్ని ప్రోత్సాహించినట్లేనని AP సీఎం జగన్ అన్నారు. ప్రీ ప్రైమరీ విధానాన్ని కూడా..పేదలకు ఇవ్వకూడదంటూ..వినిపిస్తున్న కొన్ని అభిప్రాయాలను రూపం మార్చుకున్న అంటరానితనం కనిపిస్తుందన్నారు. వీరి మనస్సు మారాలని కోరుకంటున్నట్లు తెలిపారు.
అంగన్ వాడీలంటే..ఆహారం ఇచ్చే కేంద్రాలుగా కాకుండా..మంచి విద్యను, పౌష్టికాహారానికి, మనో వికాస కేంద్రాలుగా తయారు కావాలని కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. 2020, సెప్టెంబర్ 07వ తేదీ సోమవారం ఉదయం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తల్లులకు పోషణ, పిల్లలకు సంరక్షణ, చదువుల్లో విప్లవం లక్ష్యంగా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఏపీ రాష్ట్రంలో 55 వేల 607 అంగన్ వాడీ పరిధిలో నమోదైన గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు అందరికీ ఈ పథకం వర్తింప చేసే విధంగా, 30 లక్షల 16వేల మందికి లబ్ది జరుగుతుందన్నారు.
గిరిజనేతర ప్రాంతాల్లో 47 వేల 287 అంగన్ వాడీ కేంద్రాల్లో 26 లక్షల 36 వేల మంది మధ్యాహ్న భోజనంతో పాటు..నెలకు సరిపడా పౌష్టికహారం అందించడం కోసం రూ. 15 వందల 56 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఇంకా దారుణమైన పరిస్థితులున్నాయని, రక్తహీనత ఎక్కువ, పౌష్టిహారం లోపం ఉందని గమనించి..వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం తీసుకొచ్చామని, కొంచెం మార్పులు, చేర్పులు చేశామన్నారు.
https://10tv.in/cm-jagan-convoy-gives-way-to-ambulance/
77 మండలాలు, 8 వేల 320 అంగన్ వాడీ పరిధిదుల్లోకి వస్తాయన్నారు. 3.8 లక్షల మందికి లబ్ది జరుగుతుందన్నారు. మరో 308 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు చెప్పారు. మొత్తంగా సంవత్సరానికి రూ. 1863 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.