CM Mamatha Banerjee : నిద్రపోతున్న రైల్వే శాఖ ఎప్పుడు మేలుకుంటుంది..? : ఏపీ రైలు ప్రమాదంపై దీదీ ఫైర్
‘రైల్వేశాఖ నిద్రమత్తు నుండి ఎప్పుడు బయటపడుతుంది’ అంటూ ఏపీ రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ ఘటనపై స్పందిస్తు..

CM Mamata Banerjee
CM Mamata Banerjee..Vizianagaram Train Accident : ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో పలాస రైలును రాయగుడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టిన ఘటనపై కేంద్ర ప్రభుత్వంపై జాతీయ వ్యాప్తంగా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీంట్లో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతు..రైల్వే శాఖ నిద్ర నుంచి ఎప్పుడు మేల్కొంటుంది..?అంటూ ప్రశ్నించారు. రైళ్ల ప్రమాదాలు చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు తన సంఘీభావం తెలిపారు. బాధితులకు సత్వర సహాయక చర్యలు చేపట్టాలని ఈ ఘటనపై తక్షణ దర్యాప్తుకు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో తరచు రైలు ప్రమాదంలో జరిగుతున్నాయని ఇది చాలా ఆందోళనకరమని ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నాయి అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
Another disastrous rail collision, this time in Vizianagaram district in Andhra Pradesh, involving two passenger trains, and causing uptil now at least 8 deaths and injury of at least 25 more.
Frontal collisions between trains, derailment of compartments, helpless passengers…
— Mamata Banerjee (@MamataOfficial) October 29, 2023
Nara Bhuvaneswari : రైలు ప్రమాదంపై నారా భువనేశ్వరి దిగ్బ్రాంతి.. ప్రభుత్వాన్ని ఏం కోరారంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో పలాస రైలును రాయగుడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఒకే ట్రాక్ పై ముందున్న పలాస రైలును రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా..100 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో లోకో పైలెట్, రైలు గార్డు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ రైలు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షలు ప్రకటించింది.