రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టండి – cm ys jagan పిలుపు

cm ys jagan : గ్రామ స్వరాజ్యం కళ్లెదుట కనిపించే విధంగా తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, అందులో భాగంగా గ్రామ సెక్రటేరియట్, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ రూపొందించామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. దీనిని స్థాపించి ఏడాది అవుతోందని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా..పనిచేస్తున్న, గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యంచేస్తున్న వారికి అభినందనలు తెలిపారు.
వీరందరికీ తోడుగా ఉన్నామనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని ప్రతొక్కరూ ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి ఆదరించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఇంటి వద్దకే వచ్చి..ఏ సహాయం కావాలన్నా..వివక్ష లేకుండా..లంచాలకు తావు లేకుండా..మంచి చేస్తున్నారని తెలిపారు.
గాంధీ జయంతి సందర్భంగా సీఎం జగన్ చేతుల మీదుగా గిరిజనులకు పట్టాల పంపిణీ జరిగింది. క్యాంపు ఆఫీసు నుంచి ఆయన ప్రారంభించారు. 1.53 లక్షల మంది గిరిజనులకు 3.12 లక్షల ఎకరాల భూ పంపిణీ జరుగనుంది. పోడు భూములను సాగు చేసుకునే గిరిజన రైతులకు యాజమాన్య హక్కులను ఇవ్వనుంది ప్రభుత్వం.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చామన్నారు. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని, ప్రధానంగా గిరిజనుల సంక్షేమానికి పెద్ద పీఠ వేశామన్నారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వెళుతున్నామన్నారు.
ప్రతి గిరిజనుడికి కనీసం రెండు ఎకరాలు ఇవ్వాలన్నదే తమ లక్ష్యంగా తెలిపారు. డిజిటల్ సర్వే ద్వారా సరిహద్దులు చేశామన్నారు.
గిరిజనులకు మంత్రి పదవి, కౌన్సిల్ వేయాలని గత ప్రభుత్వం ఆలోచన చేయలేదన్నారు. అలాంటి పరిస్థితులను మార్చేసి, గిరిజనులు అంటే స్వంత కుటుంబసభ్యులుగా అనుకొనే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
వైద్యం అందక ఎంతో మంది చనిపోయిన ఘటనలు కనిపించాయని, తాను కూడా స్వయంగా గిరిజన ప్రాంతాలకు వెళ్లివచ్చినట్లు గుర్తు చేశారు. గిరిజన అక్క..చెళ్లెమ్మలకు పాడేరులోనే రూ. 500 కోట్లతో వైద్య కళాశాలకు, విజయనగరం కురుపంలో రూ. 153 కోట్లతో గిరిజిన ఇంజినీరింగ్ కళాశాలకు, ఐటీడీఏ పరిధిలో 300 కోట్ల వ్యయంతో నిర్మించబోయే..మల్టీస్పెషాల్టీ ఆసుపత్రులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు సీఎం జగన్.