ఎస్సీ, ఎస్టీల బాగు కోసం జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం ప్రారంభించిన సీఎం జగన్

Jagananna YSR Badugu Vikasam: ఏపీ సీఎం జగన్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అనేక వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం జగన్.. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీల కోసం కొత్త కార్యక్రమం ప్రారంభించారు. అదే జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం. సోమవారం(అక్టోబర్ 26,2020) సీఎం జగన్ బడుగు వికాసం ప్రారంభించారు.
ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోయిందని, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే సమయం ఆసన్నమైందని సీఎం జగన్ అన్నారు. వారిని ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6శాతం మేర ఇండస్ట్రియల్ పార్కుల్లో భూములు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. పరిశ్రమ పెట్టాలనుకున్న వారు.. ఎలా ముందుకు వెళ్లాలి? ఎవరిని కలవాలి? అన్న అంశాలపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’’ పేరిట రూపొందించిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.
https://10tv.in/minister-kanna-babu-un-happy/
దసరా సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాం : జగన్
”దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించామని సీఎం జగన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు తెలిపారు. ‘‘ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, రాష్ట్రంలో ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా కోటి రూపాయల ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాం. వారిలో నైపుణ్యాలను పెంచడానికి స్కిల్ డెవలప్‌మెంట్, ఫెసిలిటేషన్ కార్యక్రమాలను చేపడుతున్నాం. స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, ఎస్సీ ఎస్టీల్లో రాయితీలు, క్వాలిటీ సర్టిఫికేషన్.. పేటెంట్ రుసుముల్లో రాయితీలు… ఇలా ఎన్నెన్నో ప్రోత్సాహకాలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు లభిస్తున్నాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అగ్రవర్ణాల్లోని పేదలకు మంచి జరగాలి:
ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అలాగే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మంచి జరగాలి. వారి కాళ్ల మీద వారు నిలబడాలనే ఉద్దేశంతో వారి జీవితాలను మార్చాలనే నవరత్నాలు సహా అనేక కార్యక్రమాలు చేపట్టాం. సచివాలయాల్లో 82శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి. పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ అమలు చేస్తున్నాం. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, కుల, మత, వర్గ, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికీ పథకాలు అందించేందుకు గ్రామ, వార్డు, వాలంటీర్ల వ్యవస్థను చేపట్టాం. ఆసరా, చేయూత లాంటి పథకాలను ప్రవేశపెట్టాం” అని సీఎం జగన్ అన్నారు.