Chandrababu Meetings : చంద్రబాబు సమీక్షా సమావేశాల్లో గందరగోళం
మూడేళ్ల నుంచి తాను పార్టీ కోసం కష్టపడుతున్నానంటూ వేదికపై స్థానిక టీడీపీ నేత ఎస్.కె రమణారెడ్డి మాట్లాడారు. ఎస్.కె రమణారెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా బాబురెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Chandrababu
Chandrababu meetings : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాల్లో గందరగోళం నెలకొంది. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. స్థానిక టీడీపీ నేత ఎస్.కె రమణారెడ్డిని టీడీపీలోని మరో వర్గం నేతలు చితకబాదారు.
మూడేళ్ల నుంచి తాను పార్టీ కోసం కష్టపడుతున్నానంటూ వేదికపై స్థానిక టీడీపీ నేత ఎస్.కె రమణారెడ్డి మాట్లాడారు. ఎస్.కె రమణారెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా బాబురెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎస్కే రమణారెడ్డిని బాబు రెడ్డి అనుచరులు చితకబాదారు.
Vishal : చంద్రబాబుపై పోటీ గురించి స్పందించిన హీరో విశాల్
గాయపడ్డ రమణా రెడ్డిని మరో నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఉన్న చంద్రబాబు నాయుడు వద్దకు అనుచరులు మోసుకెళ్లారు. అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పుంగనూరు నియోజకవర్గ నేతలపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.