CONGRATS : ప్రపంచ ర్యాపిడ్ Chess ఛాంపియన్ కోనేరు హంపి

అంతర్జాతీయ వేదికపై భారత జెండా మరోసారి రెపరెపలాడింది. రష్యాలో జరిగిన మహిళల రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్‌ను తెలుగు చెస్ ప్లేయర్ కోనేరు హంపి కైవసం చేసుకుని సత్తా చాటింది. మాస్కోలో ఈ పోటీ జరిగింది. 2019, డిసెంబర్ 29వ తేదీ ఆదివారం నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన లీ తింగ్జీపై ఘన విజయం సాధించి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచింది.
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ..అంతర్జాతీయ వేదికపై హింపి భారత జెండా రెపరెపలాండించడంపై సర్వాత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్‌లో హంపి పోటీ పడుతున్నట్లు చెస్ అభిమానులకు తెలియదు. మీడియాలో కూడా ఈ పోటీపై ఎక్కువగా ప్రచారం కూడా జరగలేదు. కానీ టోర్నీలో నిలకడగా విజయాలు సాధించి.. ట్రై బ్రేక్‌లో ఉత్కంఠను అధిగమించి..టైటిల్ సొంతం చేసుకుంది. విజయంపై ఆమె మాట్లాడుతూ…ర్యాపిడ్, బ్లిట్జ్..రెండూ ఇష్టపడే ఫార్మాట్లు కావని వెల్లడించింది.
మ్యాచ్ ఆరంభించిన అనంతరం ట్రై బ్రైక్ ఆడుతానని అనుకోలేదని, కానీ టైటిల్ గెలవడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు. కలిసి రాని ర్యాపిడ్‌లో ప్రపంచ ఛాంపియన్ కావడం తనలో ఆత్మవిశ్వాసాన్ని మరోస్థాయికి తీసుకెళ్లిందని వెల్లడించింది. తండ్రి కోనేరు అశోక్ నమ్మకాన్ని నిలబెడుతూ..ఈ ఆటలో ఆమె ఛాంపియన్‌గా నిలిచింది. ఎన్నో గొప్ప గొప్ప ఘనతలు సాధించిన ఈమె..ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి తండ్రి తనకు పెట్టిన పేరుకు సార్థకత చేకూర్చింది.
Read More : పవన్ స్టాండ్ ఏంటీ ? : మూడు రాజధానులకు అనుకూలమా ? వ్యతిరేకమా ?