ఏపీలో మరో 34 కొత్త కరోనా కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఒక్కసారిగా భారీగా నమోదైంది. ఇవాళ(14 ఏప్రిల్ 2020) ఉదయం 11 గంటలకు విడుదలైన బులిటెన్‌లో ఏపీ ప్రభుత్వం 34కొత్త కేసులు నమోదైనట్లుగా ప్రకటించింది. 15 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 34 కొత్త కేసులు నమోదు అవగా..
కోవిడ్ పరీక్షల్లో గుంటూరులో 16, కృష్ణా జిల్లాలో 8, కర్నూలులో 7, అనంతపురంలో 2, నెల్లూరులో ఒక కొత్త కేసు నమోదైంది. లేటెస్ట్‌గా నమోదైన 34 కేసులతో కలుపుకొని.. ఇప్పటి వరకు ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 473కి చేరుకుంది. ఇప్పటివరకు 14 మంది డిశ్చార్జ్ కాగా.. మొత్తం తొమ్మిది మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 2010 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 41 పాజిటివ్‌గా తేలాయి.
ఇప్పటివరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరు లో 16, కృష్ణ లో 8, కర్నూల్‌లో 7, అనంతపూర్‌లో 2 మరియు నెల్లూరులో ఒక కేసు నమోదయ్యాయి. ఇక అనంతపురం 17, చిత్తూరు 23, కడప 31, కర్నూల్ 91, ప్రకాశం 42, నెల్లూరు 56, గుంటూరు 109, కృష్ణా44 , పశ్చిమ గోదావరి 23, తూర్పు గోదావరి 17, విశాఖపట్నంలో 20కేసులు ఉన్నాయి.(కరోనాపై విజయానికి మోడీ చెప్పిన 7 సూత్రాలు)