ఏపీలో కరోనా తీవ్రత తగ్గడంలేదు…

  • Published By: sreehari ,Published On : August 19, 2020 / 05:12 PM IST
ఏపీలో కరోనా తీవ్రత తగ్గడంలేదు…

Updated On : August 19, 2020 / 5:41 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గడం లేదు.. రోజురోజుకీ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. మొన్నటివరకూ కరోనా కేసుల తీవ్రత తగ్గినట్టే కనిపించినా మళ్లీ కరోనా తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీ సహా రాష్ట్రంలోని ఇతర జిల్లాలోనూ కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 57, 685 కరోనా కేసులు నమోదు అయ్యాయి.



అందులో 9,742 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా సోకిన వారిలో చిత్తూరులో పదిహేన్ మంది, నెల్లూరులో పదిహేన్ మంది, అనంతపూర్‌లో ఎనిమిది మంది, గుంటూరులో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, కడపలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు మరణించారు.



గడిచిన 24 గంటల్లో 8,061 మంది కరోనా నుంచి పూర్తి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ ఏపీలో 30,19,296 శాంపిల్స్ పరీక్షించారు. దేశ వ్యాప్తంగా 316003 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఏపీ నుంచి 31,3108 మందికి పాజిటివ్ అని తేలింది.



ఇతర రాష్ట్రాల్లో 434 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ప్రస్తుతం 86725 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీ నుంచి మొత్తంగా 226372 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో 22,3477 మంది డిశ్చార్జి అయ్యారు.. ఇతర రాష్ట్రాల నుంచి 2461 మందికి కరోనా సోకగా.. 434 మంది డిశ్చార్జి అయ్యారు.