ఏపీలో తగ్గిన కోవిడ్ కేసులు – గడిచిన 24 గంటల్లో 111 నమోదు

covid cases update in andhra pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు క్రమేపి తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంట్లలో 33వేల 808 మంది కి పరీక్షలు నిర్వహించగా 111 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కోవిడ్ వ్యాధికి చికిత్స పొందుతూ అనంతపురంజిల్లాలో ఒక్కరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరూ మరణించారు.
గత 24 గంటల్లో కోవిడ్ వ్యాధికి చికిత్సతీసుకుని 97 మంది డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లారు. నేటి వరకు రాష్ట్రంలో 1 కోటి 29 లక్షల 75 వేల 961 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13వందల69 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది
.