Pawan Kalyan : కోర్టును ఆశ్రయించిన మహిళా వాలంటీర్.. పవన్ కళ్యాణ్ పై పరువు నష్టం కేసు నమోదు

పవన్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయని వెల్లడించారు. వాలంటీర్లలో అధికశాతం మహిళలు ఉన్నారని చెప్పారు. ఉమెన్ ట్రాఫికింగ్ కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు చెప్పి ఉంటే ఆ ఆధారాలను కోర్టుకు వెల్లడించాలన్నారు.

Pawan Kalyan : కోర్టును ఆశ్రయించిన మహిళా వాలంటీర్.. పవన్ కళ్యాణ్ పై పరువు నష్టం కేసు నమోదు

Pawan Kalyan Defamation Case

Updated On : July 24, 2023 / 4:39 PM IST

Pawan Kalyan Defamation Case : ఏపీలో వాలంటీర్లపై జనసేన (JanaSena) అధినేత పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో పవన్ కళ్యాణ్ పై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓ మహిళా వాలంటీర్ (Female Volunteer) విజయవాడ కోర్టును ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ పై వాలంటీర్ కేసు ఫైల్ చేశారు. విజయవాడ సివిల్ కోర్టు (Vijayawada Civil Court) లో పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదు అయ్యింది.

వాలంటీర్ ఇచ్చిన కేసును న్యాయమూర్తి స్వీకరించారు. తమపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురయ్యానని, న్యాయం చేయాలని మహిళా వాలంటీర్ కోర్టును ఆశ్రయించారు. వాలంటీర్ తరపున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు. సెక్షన్స్ 499, 500, 504, 505 రెడ్ విత్ 507, 511 ఆఫ్ ఐపీసీ ప్రకారం కేసు దాఖలు చేశారు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు.

Pawan Kalyan: వాలంటీర్లపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

బాధితురాలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురయ్యారని వాలంటీర్ తరపు న్యాయవాదులు తెలిపారు. కోర్టును ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుందన్నారు. బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కు కోర్టు నోటీసులు ఇస్తుందని తెలిపారు. పవన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. కోర్టు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

పవన్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయని వెల్లడించారు. వాలంటీర్లలో అధికశాతం మహిళలు ఉన్నారని చెప్పారు. ఉమెన్ ట్రాఫికింగ్ కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు చెప్పి ఉంటే ఆ ఆధారాలను కోర్టుకు వెల్లడించాలన్నారు. ప్రభుత్వానికి సహాయకులుగా ఉన్న వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదని అభిప్రాయపడ్డారు.

Pawan Kalyan : వేశ్యలకు కూడా ఒక హక్కు ఉంటుంది- మరోసారి వాలంటీర్లపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

పవన్ వ్యాఖ్యల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉందని చెప్పారు. పవన్ వెనుక ఎవరున్నారో స్పష్టం చేయాలన్నారు. అబద్ధపు వదంతులు చేసి ప్రజలను రెచ్చగొట్టి వాలంటీర్లపై తిరగబడేలా వ్యాఖ్యలు చేసిన పవన్ పై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిని కోరామని న్యాయమూర్తులు తెలిపారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు బాధించాయి
పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించిన మహిళా వాలంటీర్ 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తను ఎంతో బాధించాయని తెలిపారు. పవన్ తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. తాను భర్త చనిపోయి పిల్లలతో జీవిస్తున్నానని చెప్పారు.

Women Commission Notices To Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు మహిళా కమిషన్ నోటీసులు,10 రోజుల్లో లెక్కలతో సహా వివరణ ఇవ్వాలని ఆదేశం

పవన్ వ్యాఖ్యల తర్వాత తనను చుట్టుపక్కల వారు ప్రశ్నించారని వెల్లడించారు. ఉమెన్ ట్రాఫికింగ్ అంశాలపై కొందరు తనను ప్రశ్నించారని తెలిపారు. నిస్వార్ధంగా సేవ చేస్తున్న తమపై నిందలు వేసి పవన్ తప్పు చేశారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.