జగన్ కు ఓటు వేస్తే మోడీకి వేసినట్లే : కేజ్రీవాల్

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 01:17 PM IST
జగన్ కు ఓటు వేస్తే మోడీకి వేసినట్లే : కేజ్రీవాల్

Updated On : March 28, 2019 / 1:17 PM IST

ఏపీలో వైసీపీకి ఓటు వేస్తే…కేంద్రంలో మోడీకి ఓటు వేసినట్లేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మోడీ వల్ల అందరికీ దు:ఖమే అని తెలిపారు. దేశం బాగుండాలంటే మోడీ మళ్లీ అధికారంలోకి రాకూడదన్నారు. మోడీని ఓడించాలని పిలుపు ఇచ్చారు. 

మైలవరంలో టీడీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు ఆయన హాజరై ప్రసంగించారు. జగన్ కు ఓటు వేస్తే మోడీకి ఓటు వేసినట్లేనని తెలిపారు. పేద, మధ్యతరగతి అభివృద్ధికి కారణం చంద్రబాబే అన్నారు.