Illegal Structures Demolition : టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు షాపింగ్‌ కాంప్లెక్స్‌ కూల్చివేత

విశాఖపట్నంలో మరోసారి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మొదలయ్యాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన షాపింగ్ కాంప్లెంక్స్‌ను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు.

Illegal Structures Demolition : టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు షాపింగ్‌ కాంప్లెక్స్‌ కూల్చివేత

Demolition Of Tdp Leader Palla Srinivasa Rao Shopping Complex

Updated On : April 25, 2021 / 9:40 AM IST

TDP leader Palla Srinivasa Rao : విశాఖపట్నంలో మరోసారి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మొదలయ్యాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన షాపింగ్ కాంప్లెంక్స్‌ను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. పాత గాజువాక సెంటర్‌ వద్ద నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌ను తెల్లవారుజామున కూల్చివేశారు.

అనుమతులు లేకుండా కాంప్లెక్స్‌ కడుతున్నందుకే కూల్చివేశామని… గ్రేటర్ విశాఖ కార్పోరేషన్ అధికారులు చెబుతున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారంటూ పల్లా శ్రీనివాసరావు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణం అని తేలితే ఎలాంటి చర్యలకైనా సిద్ధమంటున్నారు.