Pawan Kalyan : చాతుర్మాస దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్.. ఏయే నియమాలు పాటిస్తారంటే.!
Pawan Kalyan : మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి పవన్ ఈ దీక్ష చేపట్టారు.
deputy cm pawan kalyan
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేపట్టారు. బుధవారం ఉదయం మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి పవన్ ఈ దీక్ష చేపట్టారు. ప్రతి ఏడాదిలో జ్యేష్ఠ మాసంలో ఈ దీక్షను ప్రారంభించి కార్తీక మాసంలో దీక్ష విరమిస్తున్నారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమంతప్పకుండా ప్రతి ఏడాది చేస్తూ వస్తున్నారు పవన్.
దీక్షా కాలంలో నియమితమైన జీవనంతోపాటు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. అదేవిధంగా విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రా ధారణ, చందన వర్ణ వస్త్రధారణనుతో పవన్ కనిపిస్తుంటారు. నిత్యం అనుష్ఠానం, దేవతారాధనగావిస్తూ సమయానుకూలంగా ధ్యానం, మంత్ర పారాయణం చేస్తుంటారు.
ఈ క్రమంలోనే బుధవారం రోజున దీక్షను స్వీకరించారు పవన్ కళ్యాణ్.. దీక్షా కాలంలో నియమితమైన జీవనంతోపాటు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. అలాగే విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలు ధరిస్తారు. దీక్షా సమయంలో ఎక్కువగా చందన వర్ణ వస్త్రధారణను పవన్ కళ్యాణ్ అవలంబిస్తుంటారు. నిత్యం అనుష్ఠానం, దేవతారాధన చేస్తూ.. సమయానుకూలంగా ధ్యానం, మంత్ర పారాయణం చేస్తారు.
