విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల నేతలకు పవన్ కల్యాణ్ కీలక హామీ..!

విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం చేసిన త్యాగాలను మరచిపోవద్దని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల నేతలకు పవన్ కల్యాణ్ కీలక హామీ..!

Vizag Steel Plant (Photo Credit : Facebook, Google)

Updated On : October 6, 2024 / 11:06 PM IST

Visakha Steel Plant Privatisation : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల సమావేశం ముగిసింది. తమ సమస్యలన్నీ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. మాకు తప్పకుండా న్యాయం చూస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని వారు తెలిపారు. రేపు జరగబోయే సమావేశంలో మా సమస్యల గురించి మాట్లాడి పరిష్కారం దిశగా నిర్ణయాలు ఉంటాయని పవన్ చెప్పారని కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. మా ఇష్యూస్ ను కేంద్రం వద్దకి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పవన్ కల్యాణ్ చెప్పారని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం చేసిన త్యాగాలను మరచిపోవద్దని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం కార్మికులు, ఉద్యోగులు, వారి సంఘాల్లో ఉండాలన్నారు. ఉద్యోగులు, కార్మికులు, భూ నిర్వాసితుల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. 32 మంది బలిదానాలు, 16 వేల మంది నిర్వాసితుల త్యాగాలు, 24 వేల ఎకరాల భూసేకరణతో ఏర్పాటైన పరిశ్రమ విశాఖ స్టీల్ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Also Read : పవన్ కల్యాణ్.. అదొక పెద్ద క్రైమ్, జాగ్రత్తగా ఉండండి..!- హర్షకుమార్ వార్నింగ్