విశాఖకు తుఫాన్ల ముప్పు సరే.. మరి.. అమరావతిలో వరదలు రావా?
విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. వైజాగ్ కి తుఫాన్ల ముప్పు పొంచి ఉందని, రాజధానిగా సురక్షితం

విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. వైజాగ్ కి తుఫాన్ల ముప్పు పొంచి ఉందని, రాజధానిగా సురక్షితం
విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. వైజాగ్ కి తుఫాన్ల ముప్పు పొంచి ఉందని, రాజధానిగా సురక్షితం కాదని.. దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైపరిత్యాలకు ఏ ప్రాంతం అతీతం కాదన్న వాస్తవాన్ని టీడీపీ నేతలు విస్మరిస్తున్నారని ఆగ్రహించారు. విశాఖలో వరదలు, తుఫాన్లు వస్తాయని ప్రచారం చేస్తున్నార.. మరి అమరావతిలో వరదలు రావా అని ఆయన ప్రశ్నించారు. విశాఖ సముద్ర తీరాన ఉందనే సాకు చూపిస్తున్నారు.. మరి మహారాష్టర, తమిళనాడు రాష్ట్రాల రాజధానులు ముంబై, చెన్నై నగరాలు సముద్రం ఒడ్డున లేవా? ఆ నగరాలు అభివృద్ధి చెందలేనా? అని టీడీపీ నేతలను నిలదీశారు.
దేశ రాజధానిగా పనికొచ్చే విశాఖ.. రాష్ట్ర రాజధానిగా మాత్రం పనికిరాదా?
గతంలో విశాఖపట్నం గొప్ప నగరం అంటూ చంద్రబాబు ప్రశంసించారని.. దేశానికి రెండో రాజధాని అయ్యే అన్ని అర్హతలు ఉన్న నగరం విశాఖ అని చెప్పలేదా అని మంత్రి అడిగారు. అలాంటి నగరంలోనే ఇప్పుడు తాము రాజధానిని ఏర్పాటు చేస్తామంటే.. ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మంత్రి నిలదీశారు. దేశానికి రెండో రాజధానిగా పనికొచ్చే నగరం.. రాష్ట్ర రాజధానిగా మాత్రం పనికిరాదా? అని క్వశ్చన్ చేశారు. జీఎన్ రావ్ కమిటీ నివేదికను భోగి మంటల్లో వేసిన చంద్రబాబుకి.. మళ్లీ జీఎన్ రావు కమిటీపై ప్రేమ ఎందుకు పెరిగిందో అర్థం కావడం లేదు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో, ప్రజలను మోసం చేయడంలో దేశంలోనే చంద్రబాబు నంబర్ వన్ అని విమర్శించారు.
రాజధాని వికేంద్రీకరణపై ఎల్లో మీడియా విషం:
రాజధాని వికేంద్రీకరణపై ఎల్లో మీడియా విషం కక్కుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో రాజధాని వద్దని జీఎన్ రావు కమిటీ చెప్పిందని తప్పుడు వార్తలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖలో పెట్టాలని కమిటీ సూచించిందన్నారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాతనే మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో చంద్రబాబు అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాన్ని డిప్యూటీ సీఎం తిప్పికొట్టారు.
సీఎం జగన్ లక్ష్యం అదే:
అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేయాలనేది సీఎం జగన్ అభిమతం అని మంత్రి చెప్పారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీ, హైపర్ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. అభివృద్ది వికేంద్రీకరణపై కొందరు అదేపనిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. అభివృద్ది వికేంద్రీకరణకు వ్యతిరేకమని టీడీపీ మాటల ద్వారా స్పష్టమవుతోందన్నారు. ఒక సామాజిక వర్గానికి న్యాయం చేయడం కోసం చంద్రబాబు అమరావతిని రాజధాని చేయాలంటున్నారని ఆరోపించారు. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను తుంగలో తొక్కి తనకు అనుకూల నివేదికను ఇచ్చే నారాయణ కమిటీని ఏర్పాటు చేశారని మంత్రి ఫైర్ అయ్యారు.
Also Read : పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ : జనసేనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా