దేవళ్ల రేవతి@ వివాదం : ఈసారి ఆమె మేనల్లుడు

Devalla Revathi Controversy : వైసీపీ నేతలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. టోల్ గేట్ వద్ద జరిగిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏపీ వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ల రేవతి టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసిన దృశ్యాలు హల్ చల్ చేశాయి. ఇది జరిగి రెండు రోజులు కాకముందే..ఆమె మేనల్లుడు వైద్య సిబ్బందిపై దాడి చేసినట్లు ఓ వీడియో షికారు చేస్తోంది. దాచేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న అనంతరం బిల్లు కట్టకుండా..రేవతి మేనల్లుడు దాడి చేశాడని నర్సింగ్ హోం సిబ్బంది ఆరోపిస్తున్నారు.
ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ దేవళ్ల రేవతి…వీరంగం సృష్టించిన ఘటన సంచలనం సృష్టించింది. 2020, డిసెంబర్ 10వ తేదీ గురువారం ఉదయం గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ నుంచి వెళుతుండగా..టోల్ ఫీజు కట్టాలని అక్కడున్న సిబ్బంది ఆమెకు చెప్పారు. కారు దిగిన ఆమె..స్టాప్ పేరిట ఉన్న బోర్డులు, బారికేడ్లను తొలగించడం వివాదానికి దారి తీసింది. దుర్భాషలాడుతూ వారిపై చేయి చేసుకుంది. దీనిపై సీఎంవో ఆఫీసు వివరణ కోరింది. నేడు..ఆమె మేనల్లుడు దాడి చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై రేవతి ఎలా స్పందిస్తారో చూడాలి.
‘ఏ తప్పు చేయలేదు..టోల్ ప్లాజా సిబ్బందే దురుసుగా ప్రవర్తించారు..అన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడారని దేవళ్ల రేవతి వెల్లడించారు. ఆమె 10tvతో మాట్లాడారు. తన తల్లికి ఆరోగ్యం మంచిగా లేకపోతే..ఆసుపత్రికి వెళుతున్న సందర్భంలో ఆపినట్లు, తనకు ఫ్రీ పాస్ ఉంది..కేవలం వైసీపీ పార్టీని బ్లేమ్ చేయడానికి..తనను తక్కువ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.