Devotees : పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా వేలాది మంది భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు.

Devotees : పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

DEVOTEES

Devotees Flock : ఏలూరు జిల్లాలోని పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా వేలాది మంది భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామక్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయం శివనామస్మరణతో మారుమ్రోగుతోంది. సోమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.

Yadagirigutta : యాదగిరిగుట్టకి పోటెత్తిన భక్తులు
భక్తులతో కిటకిటలాడుతున్న గోష్పాద క్షేత్రం
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో గోష్పాద క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులు పవిత్ర గోదావరి స్థానం ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో అభిషేకాలు చేస్తున్నారు. బాల త్రిపుర సుందరి సమేత సుందర్వేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణంతో మార్మోగుతోంది.

అలాగే తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.