Yadagirigutta : యాదగిరిగుట్టకి పోటెత్తిన భక్తులు

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ధర్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

Yadagirigutta : యాదగిరిగుట్టకి పోటెత్తిన భక్తులు

Yadagirigutta

Updated On : December 10, 2023 / 11:04 AM IST

Devotees Flock to Yadagirigutta : యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్టకి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం, ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ధర్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. నిన్న(శనివారం) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి నిత్య ఆదాయం రూ.62 లక్షల 31 వేల 717 వచ్చింది. 1744 సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు నిర్వహించారు.

Yadadri Temple : యాదాద్రికి కానుకల వెల్లువ.. 16 రోజుల్లో కోటి 78 లక్షలు హుండీ ఆదాయం

మరోవైపు ఏపీలో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.