Yadadri Temple : యాదాద్రికి కానుకల వెల్లువ.. 16 రోజుల్లో కోటి 78 లక్షలు హుండీ ఆదాయం

Yadadri : భక్తులు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. హుండీలో కానుకలు వేస్తున్నారు.

Yadadri Temple : యాదాద్రికి కానుకల వెల్లువ.. 16 రోజుల్లో కోటి 78 లక్షలు హుండీ ఆదాయం

Yadadri Temple (Photo : Google)

Updated On : June 15, 2023 / 6:13 PM IST

Yadadri Temple Hundi Collection : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆలయం పునర్ నిర్మాణం తర్వాత భక్తుల తాకిడి మరింత పెరిగింది. దాంతో పాటే ఆలయానికి కానుకలు వెల్లువెత్తాయి. హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. భక్తులు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. హుండీలో కానుకలు వేస్తున్నారు.

హండీ కానుకలతో పాటు పూజ, సేవా కార్యక్రమాలు, ప్రసాదం రుసుముల ద్వారా గత 16 రోజుల్లో యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానానికి కోటినర్న రూపాయలకు పైగానే హుండీ ఆదాయం సమకూరింది. హుండీ ఆదాయం అక్షరాల ఒక కోటి 78 లక్షల 52 వేల 446 రూపాయలుగా ఉంది. (రూ. 1,78,52,446). ఈ నగదుతోపాటు బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా భక్తులు స్వామివారికి సమర్పించుకున్నారు.

Also Read.. Ayodhya: శరవేగంగా అయోధ్య రామాలయ నిర్మాణం.. దీపావళికి తొలి అంతస్తు సిద్ధం

హుండీ ఆదాయం.. (రూ. 1,78,52,446)

మిశ్రమ బంగారము : 86 గ్రాములు
మిశ్రమ వెండి : 3 కేజీల 500 గ్రాములు

విదేశీ కరెన్సీ :
అమెరికా-664 డాలర్లు
యూఏఈ-5 దిరామ్స్
ఆస్ట్రేలియా-10 డాలర్స్
కెనడా-70 డాలర్స్
ఒమన్-6001/2 బైసా
కతార్-1

Also Read..Tirumala : శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి వద్ద క్యూ లైన్ లో మార్పులు

యూరోప్-25
బుటన్-1
సౌతాఫ్రికా-100
బంగ్లాదేశ్-10
జపనీస్(yen)-1000
నేపాల్-10
సిరియా-5000

ఆలయాన్ని పునరుద్ధరణ చేసిన ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పించింది. రవాణ, వసతి సహా అనేక సౌకర్యాలు పెంచడంతో యాదాద్రికి భక్తుల సంఖ్య క్రమంగా భారీగా పెరిగింది. దాంతో పాటుగా హుండీ ఆదాయం పెరిగింది.