ఎన్నికల బరిలో డాక్టర్లు : ఓటర్ల ‘నాడి’పట్టేందుకు పోటీ
డాక్టర్లు రోగుల నాడి (Pulse) చూడటమే కాదు ఓటర్ల నాడి కూడా పట్టేస్తామంటున్నారు. వైద్యం చేయటమే కాదు ప్రజా సేవ కూడా చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేసేందుక రెడీ అయ్యారు డాక్టర్లు.

డాక్టర్లు రోగుల నాడి (Pulse) చూడటమే కాదు ఓటర్ల నాడి కూడా పట్టేస్తామంటున్నారు. వైద్యం చేయటమే కాదు ప్రజా సేవ కూడా చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేసేందుక రెడీ అయ్యారు డాక్టర్లు.
డాక్టర్లు రోగుల నాడి (Pulse) చూడటమే కాదు ఓటర్ల నాడి కూడా పట్టేస్తామంటున్నారు. వైద్యం చేయటమే కాదు ప్రజా సేవ కూడా చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేసేందుక రెడీ అయ్యారు డాక్టర్లు. ఏపీలో అసెంబ్లీ.. లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల బరిలోకి కొందమంది డాక్టర్లు కూడా పోటీ చేస్తున్నారు. డాక్టర్లు రాజకీయ నేతలుగా మారారు. ప్రజాక్షేత్రంలో పొలిటికల్ నాడి తెలుసుకుని..లీడర్లుగా చక్రం తిప్పుతున్నారు.
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ
వృత్తి వైద్యమైనా ప్రవృత్తి రాజకీయంగా చేసుకుని కొనసాగుతున్నారు. ప్రస్తుత ఏపీ పార్టీల్లో డాక్టర్లు ఓటర్ల నాడి పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల నుంచి పలువురు వైద్యులు ఎన్నికల బరిలో మేమున్నామంటున్నారు. వీరిలో కొందరు ఎంబీబీఎస్ లు, ఎండీలు,సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కూడా నిర్వహిస్తున్నవారున్నారు. పార్టీల వారీగా ప్రస్తుతం బరిలో నిలిచిన ‘డాక్టర్ లీడర్’లు ఎవరో చూద్దాం..
టీడీపీ నుంచి బరిలో ఉన్న డాక్టర్లు
- పాయకరావుపేట – డాక్టర్ బి. బంగారయ్య
- కొండపి -డాక్టర్ బీవీఏ స్వామి
- కనిగిరి- డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
- సత్తెనపల్లి- డాక్టర్ కోడెల శివప్రసాద్‌రావు (స్పీకర్)
జనసేన నుంచి బరిలో ఉన్న డాక్టర్లు
- రాజాం-డాక్టర్ మచ్చా శ్రీనివాసరావు
- పాలకొండ – డాక్టర్ జీవీజీ శంకరరావు
- ఎర్రగొండపాలెం -డాక్టర్ గౌతం
- చంద్రగిరి- డాక్టర్ శెట్టి సురేంద్ర
వైసీపీ నుంచి బరిలో ఉన్న డాక్టర్లు
- బద్వేల్ -డాక్టర్ జీవీ సుబ్బయ్య
- నరసరావుపేట- డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
- తాడికొండ- డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
- ఎర్రగొండపాలెం – డాక్టర్ సురేష్
- కొండపి -డాక్టర్ మాదాసు వెంకయ్య
- పలాస- డాక్టర్ సీదిరి అప్పలరాజు
- మడకశిర-డాక్టర్ ఎం.తిప్పేస్వామి
- కదిరి – డాక్టర్ పీవీ సిద్దారెడ్డి
రోగుల నాడిని పట్టే ఈ డాక్టర్లు ఓటర్ల నాడి పట్టేనో లేదో ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష