AP Rajya Sabha Election : టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది వీళ్లే.. తెరపైకి పలువురి పేర్లు
AP Rajya Sabha Election : రాజ్యసభ ఎన్నికలపై కీలక ప్రకటన వచ్చేసింది. జూన్ 1న షెడ్యూల్ విడుదల కానుంది. ఈ క్రమంలో ఏపీ టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థులపై ఆసక్తి నెలకొని ఉంది.
eci announced rajya sabha election schedule 2026 candidates from ap tdp
- రాజ్యసభ ఎన్నికలపై ప్రకటన
- జూన్ 1న షెడ్యూల్ విడుదల
- తెరపైకి పలువురు టీడీపీ అభ్యర్థుల పేర్లు
AP Rajya Sabha Election : రాజ్యసభ ఎలక్షన్ షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ సహా.. దేశవ్యాప్తంగా 24 స్థానాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆపై జూన్ 18న ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఏపీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో త్వరలోనే నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే ఈ స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించి కూటమి నేతలు ఒక అంగీకారానికి వచ్చారని సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు తమ అభ్యర్థుల విషయంలో దాదాపు నిర్ణయానికి వచ్చేశాయని ప్రచారం జరుగుతోంది.
నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీకి కేటాయించగా.. బీజేపీ, జనసేన పార్టీల నుంచి ఒక్కో అభ్యర్థి ఎన్నికవుతారని సమాచారం. ఈ క్రమంలో టీడీపీ నుంచి రేసులో సానా సతీష్ (దాదాపు ఖాయం), భాష్యం రామకృష్ణ, టీడీ జనార్దన్, కిలారు రాజేష్, చింతకాయల విజయ్, యనమల, కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, తిప్పేస్వామి వంటి నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
