Avinash Reddy ED Raids : వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంట్లో, కార్యాలయంలో ఈడీ సోదాలు
YCP MP Avinash Reddy : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంట్లో, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ED Raids YSRCP MP Avinash Reddy Residence and Office
YCP MP Avinash Reddy -ED Raids : తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంట్లో, కార్యాలయాల్లో ఈడీ అధికారులు శుక్రవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి పది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో నాలుగు చోట్ల, హైదరాబాద్ ఆరు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలిసింది.
Also Read : AP Deputy CM Pawan Kalyan : కేరళకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 20రోజులు అక్కడే.. కారణం ఇదే..
పులివెందులలోని ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసంలో.. కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అవినాశ్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న వర్కర్స్ మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ సోదాల్లో నలుగురు ఈడీ అధికారులు, ముగ్గురు పోలీసులు పాల్గొన్నారు. పులివెందులలోని అవినాష్‌రెడ్డి నివాసానికి ఈడీ అధికారులు వెళ్లగా.. ఇంటికి తాళం వేసి ఉండటంతో బయట వేచి ఉన్నారు. ఎంపీ అవినాశ్ ఇంటి తాళాలు ఇవ్వాలని పీఏ రమణారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించగా.. ఎంపీ నుంచి సమాచారం లేదని.. ఇంటి తాళాలు ఇవ్వలేమని చెప్పినట్లు తెలిసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హవాలా రూపంలో డబ్బులు చేతులు మారినట్లు అనుమానంతో ఈడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఎంపీ అవినాశ్ రెడ్డితోపాటు దస్తగిరి ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. హత్యకు ముందు నగదు లావాదేవీల వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. సీబీఐ దర్యాప్తు సమయంలో బయటకొచ్చిన అంశాలపై మరింత లోతుగా విచారణ చేస్తోంది. నిందితులకు ఇచ్చిన రూ.4 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయన్న అంశంపైనే ఈడీ ప్రధానం దృష్టి సారించింది.
