బ్యాలెట్ పేపర్లతో స్థానిక సంస్థల ఎన్నికలు 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

  • Published By: veegamteam ,Published On : March 6, 2020 / 12:18 PM IST
బ్యాలెట్ పేపర్లతో స్థానిక సంస్థల ఎన్నికలు 

Updated On : March 6, 2020 / 12:18 PM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.శుక్రవారం (మార్చి 6, 2020) కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల సమయం తక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల కమిషనర్ హెచ్చరించారు.

మద్యం, డబ్బులు, బహుమతుల పంపిణీకి అడ్డుకట్ట 
బ్యాలెట్ పేపర్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి బ్యాలెట్ పేపర్ కరెన్సీతో సమానమని ఎన్నికల కమిషనర్ చెప్పారు. మద్యం, డబ్బులు, బహుమతుల పంపిణీకి అడ్డుకట్ట వేయడంపై స్పెషల్ ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలని సూచించారు. వి విజిల్ తరహాలో ఎన్నికల నిర్వహించనున్నారు. మరికాసేపట్లో రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల కమిషనర్ రమేష్ భేటీ కానున్నారు. 

ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్  
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 21న తొలి విడత ఎన్నికలు, మార్చి 24న రెండో విడత ఎన్నికల జరుగున్నాయి. మార్చి 27న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 29న ఎన్నికల కౌంటింగ్, ఫలితాలు విడుదల కానున్నాయి. ఇది తెలిసిన సమాచారం మేరకే. రేపు అధికారికంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించనున్నారు. 

7న తొలి విడత ఎన్నికల నోటిషికేషన్ 
మార్చి 7న తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిషికేషన్ విడుదల కానుంది. ఈనెల 9 వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ జరుగనుంది. మార్చి 12వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. మార్చి 14న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 21న స్థానిక ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈనెల 29న కౌంటింగ్ జరుగనుంది. 

10న రెండో విడత ఎన్నికల నోటిషికేషన్ 
మార్చి 10న రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిషికేషన్ విడుదల కానుంది. మార్చి 12 నుంచి 14 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మార్చి 15న నామినేషన్లను పరిశీలించనున్నారు. మార్చి 17న సాయంత్రం 3గంటలకు వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది. 

13న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్
ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఈనెల 13న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 15 నుంచి 17 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 18న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. మార్చి 20న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. మార్చి 27న పోలింగ్ జరుగనుంది. ఈ నెల 29న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు.