తెలుగుదేశం పార్టీలో చేరికల జోష్.. మంత్రి లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ దంపతులు

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం వీడి వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ పార్టీలోకి వెళ్లాక ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయాం.

తెలుగుదేశం పార్టీలో చేరికల జోష్.. మంత్రి లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ దంపతులు

Eluru Mayor Noor Jahan Couple Join Tdp (Photo Credit : Twitter)

Updated On : August 27, 2024 / 5:34 PM IST

Eluru Mayor Noorjahan Joins Tdp : ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి నారా లోకేశ్. ఈయూడీఏ మాజీ ఛైర్మన్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ గుణపాఠం నేర్చుకోలేదని మండిపడ్డారు నారా లోకేశ్. ప్రజా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

బడేటి చంటి, ఏలూరు ఎమ్మెల్యే..
ఏలూరు అభివృద్ధి కోసం కలిసి వచ్చే వారికి స్నేహహస్తం అందిస్తున్నాం. ఆళ్లనాని వైసీపీ కార్యకర్తలను వదిలేసి పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే వారిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నాం. త్వరలోనే దశల వారీగా కార్పొరేటర్లు టీడీపీలో చేరబోతున్నారు.

షేక్ నూర్జహాన్, ఏలూరు మేయర్..
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం వీడి వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ పార్టీలోకి వెళ్లాక ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయాం. దాదాపు 40మంది కార్పొరేటర్లు త్వరలోనే తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధoగా ఉన్నారు.

Also Read : వైసీపీని వెంటాడుతున్న డర్టీ పిక్చర్ ఎపిసోడ్‌.. నేతల తీరుతో తలపట్టుకుంటున్న హైకమాండ్..!