Vishnukumar Raju : 2024లో అక్కడ నేనే ఎమ్మెల్యేని.. జగన్ అలా మాట్లాడి ఎవరిని మభ్యపెడుతున్నారు

మద్యం పేరుతో నాలుగు సంవత్సరాలుగా దోపిడీ చేశారు. కల్తీ మద్యంతో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. వైసీపీ ప్రభుత్వం మద్యంపై శ్వేతపత్రం విడుదల చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.

Vishnukumar Raju : 2024లో అక్కడ నేనే ఎమ్మెల్యేని.. జగన్ అలా మాట్లాడి ఎవరిని మభ్యపెడుతున్నారు

Vishnukumar Raju

Updated On : October 11, 2023 / 12:33 PM IST

Former BJP MLA Vishnukumar Raju : బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో నేను ఎమ్మెల్యే అవుతా.. జగన్ మోహన్ రెడ్డి వచ్చి ఆ నియోజకవర్గంలో బరిలోకి దిగినా గెలిచేది నేనే.. పొత్తు ఉన్నా లేకున్నా అక్కడ నాదే విజయం అంటూ వ్యాఖ్యానించారు. బుధవారం విశాఖలో విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. అయితే, చంద్రబాబు అరెస్ట్ జగన్ కు తెలియదని చెప్పడం విడ్డూరంగా ఉంది. జగన్ మోహన్ రెడ్డి ఎవరిని మభ్యపెడుతున్నాడు.. సీబీఐను కంట్రోల్ చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిది అంటూ విష్ణుకుమార్ రాజు అన్నారు.

Read Also : Ambati Rambabu : ఆయన వల్లే టీడీపీ సర్వ నాశనం.. కాపాడటం ఎవరి వల్ల కాదు : మంత్రి అంబటి

మద్యం పేరుతో నాలుగు సంవత్సరాలుగా దోపిడీ చేశారు. కల్తీ మద్యంతో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. వైసీపీ ప్రభుత్వం మద్యంపై శ్వేతపత్రం విడుదల చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో గ్రామ వాలంటీర్లను దూరంగా ఉంచాలి.. ఎన్నికల నోటిఫికేషన్ నుండే ఏపీలో మద్యాన్ని బ్యాన్ చేయాలని అన్నారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ప్రజలు స్పదించాలని విష్ణుకుమార్ రాజు కోరారు. వైసీపీలో ప్రతీది స్కామే. 2024 ఎన్నికల్లో వైసీపీని ఎట్టిపరిస్థితుల్లో ఎన్నుకోకండి అంటూ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో మహిళలపై మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు.

Read Also : Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు.. ఆ నియోజకవర్గాలపై ఫోకస్

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 2024లో నేనే ఎమ్మెల్యేగా విజయం సాధిస్తా. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉత్తర నియోజకవర్గంలో పోటీచేసినా నాపై ఓడిపోతాడని విష్ణుకుమార్ రాజు అన్నారు. జగన్ పులివెందల నుండి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి. పొత్తు ఉన్నా.. లేకున్నా.. జగన్ పోటీచేసినా గెలిచేది నేనే.. ప్రజలు నన్నే గెలిపిస్తారంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధీమా వ్యక్తం చేశారు.