Perni Nani : జగన్‌ని ఓడించడం, చంద్రబాబుకి అధికారం కట్టబెట్టడమే ధ్యేయం- పవన్ కల్యాణ్‌పై పేర్నినాని ఫైర్

అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు? అని ప్రశ్నించారు పేర్నినాని. ఒక మెడికల్ కాలేజీ కానీ, పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ ఎందుకు నిర్మించలేదని నిలదీశారు.

Perni Nani

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఫైర్ అయ్యారు మాజీమంత్రి పేర్నినాని. పవన్ కల్యాణ్ కి వైసీపీని, జగన్ ని ఓడించడం మాత్రమే ధ్యేయం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కానీ వారి బాగోగులు కానీ పవన్ కల్యాణ్ కు అక్కర్లేదన్నారు. జగన్ ని ఓడించి చంద్రబాబుకి అధికారం కట్టబెట్టడమే పవన్ కల్యాణ్ ధ్యేయం అని పేర్నినాని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయ మనుగడే పవన్ కల్యాణ్ ధ్యేయం అని విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ జనసేన అనే టెంట్ హౌజ్ పార్టీ పెట్టాడని నేను ఎప్పుడో చెప్పారు అని పేర్నినాని అన్నారు. పవన్ కల్యాణ్ తన టెంట్ హౌజ్ పార్టీని లాంగ్ లీజుకి చంద్రబాబుకి ఇచ్చారని విమర్శించారు.

పవన కల్యాణ్ జీవనం అంతా పరాయి రాష్ట్రంలోనే. ఓటు అక్కడే, గాలి పీల్చడం అక్కడే, ఆస్తులు అక్కడే అని వ్యాఖ్యానించారు. రాజకీయాలు మాత్రం ఇక్కడ అని ధ్వజమెత్తారు. పవనే కాదు పేపర్ వాళ్లు చంద్రబాబుని పొగిడేవారు అందరూ అక్కడి వాళ్ళే అన్నారు. నేనైనా, మా ముఖ్యమంత్రి జగన్ అయినా చనిపోయాక మా శవాలు ఇక్కడే పాతిపెడతారు అని పేర్నినాని అన్నారు.

Also Read : ఏపీ రాజకీయాల్లో సంచలనం..! టీడీపీతో టచ్‌లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్..!

పవన్ కల్యాణ్ కానీ చంద్రబాబు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు? అని ప్రశ్నించారు పేర్నినాని. ఒక మెడికల్ కాలేజీ కానీ, పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ ఎందుకు నిర్మించలేదు అని నిలదీశారు. మా కన్నా ఎక్కువ బడ్జెట్ కేటాయించారు, అప్పులు తెచ్చారు. అవన్నీ ఏమయ్యాయి అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కి ఉన్న ఒకే ఒక ఆరాటం చంద్రబాబుకు అధికారం కట్టబెట్టాలని పేర్నినాని విమర్శించారు.

చంద్రబాబుపైనా నిప్పులు చెరిగారు పేర్నినాని. శవాల మీద పేలాలు ఏరుకునే రకం చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబుకి కొత్తగా వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రేమ పుట్టుకొచ్చింది, గోతికాడ నక్కలా వారి కోసం ఎదురుచూస్తున్నారు అని ధ్వజమెత్తారు. రాజకీయ నాయకులకు కూడా ట్రాన్స్ ఫర్స్ ఉంటాయా అని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబుది రెండు కళ్ళ సిద్ధాంతం. రెండు నాలుకల ధోరణి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40ఏళ్ల ఇండస్ట్రీ అంటారు, 13ఏళ్లు సీఎంగా చేశాను అంటారు. మరి విలువలు లేని రాజకీయాలు ఎలా చేశారు అని చంద్రబాబుపై మండిపడ్డారు.

Also Read : సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైసీపీలో భారీ మార్పులు

ఈసారి ఎన్నికల్లో 175 సీట్లకు గాను 175 సీట్లు గెలవడానికి సీఎం జగన్ అన్ని ఏర్పాట్లు, వ్యూహాలు చేసుకున్నారు అని చెప్పారు పేర్నినాని. ట్రాన్స్ ఫర్లు అంటున్న చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గం నుండి కుప్పంకు ఎలా వచ్చారు? కోడెల శివప్రసాద్ ని నరసరావుపేట నుండి సత్తెనపల్లికి ఎలా తీసుకొచ్చారు? మేము వద్దనుకున్న నలుగురు రెడ్లను టీడీపీలో చేర్చుకున్నావు. ఒక రాజు గారిని కౌగిలించుకున్నావు. చంద్రబాబుకి రాజకీయాల్లో కుక్కచావు తప్పదు. మా జగన్ వేసే రాజకీయ ఎత్తుగడలకు చంద్రబాబుకి షాకులు తగులుతున్నాయి” అని మాజీమంత్రి పేర్నినాని అన్నారు.