ఎన్టీఆర్‌లా జగన్ అమాయకుడు కాదు, ఎంత తొక్కినా బంతిలా పైకి వస్తూనే ఉంటారు- పేర్నినాని

అనేక అభియోగాలున్న ఓ మహిళను ప్రధాన పాత్రగా పెట్టి కొందరు పోలీసు అధికారులపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఆ మహిళపై ఉత్తర భారత దేశంలో అన్ని రాష్ట్రాల్లో చెప్పడానికి ఇబ్బంది పడే కేసులు ఉన్నాయి.

ఎన్టీఆర్‌లా జగన్ అమాయకుడు కాదు, ఎంత తొక్కినా బంతిలా పైకి వస్తూనే ఉంటారు- పేర్నినాని

Perni Nani : సీఎం చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు మాజీ మంత్రి పేర్నినాని. చంద్రబాబు రాజకీయ అమ్మకాలు కొనుగోలు చూస్తుంటే జాలేస్తుందన్నారు. గతంలో ఇలాంటి రాజకీయంతో చంద్రబాబు లబ్ధి పొందారని, ఎన్టీఆర్ ను పడగొట్టగలిగారని ఆరోపించారు. ఎన్టీ రామారావు అమాయకుడు కనుక ఆనాడు చంద్రబాబు ఆటలు సాగాయన్నారు. ఎన్టీఆర్ లా వైఎస్ జగన్ అమాయకుడు కాదన్నారు. జగన్ ను రాజకీయాల నుండి పక్కకి తీసెయ్యడానికి 2011 నుండి ప్రయత్నిస్తూనే ఉన్నారని.. ఎంత తొక్కినా బంతిలా జగన్ పైకి వస్తూనే ఉంటారని పేర్నినాని అన్నారు.

”మాటల్లో మాత్రం రాజీనామా చేసి రావాలని అంటూనే.. పదవులతో పార్టీలో చేర్చుకుంటున్నారు. అందరినీ చేర్చుకుని ఏం చేసుకుంటారు..? ఎంతమందిని తీసుకున్నా జగన్ ను రాజకీయంగా అంగుళం కూడా కిందకి దించలేవు. జంప్ జిలానీలు జగన్ కు అవసరం లేదు. జనం సాయం ఉంటే చాలు. ఇలాంటి జంపింగ్ లు జగన్ ను కుంగదీయలేవు. ఈరోజు ఇద్దరు రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేయించారు. ఈ ఇద్దరి బీసీల స్థానంలో సతీశ్, రాకేశ్ లు రాజ్యసభకు ఎందుకు వస్తున్నారో అందరికీ తెలుసు. ఖాళీ అయిన స్థానాల్లో బీసీ, ఎస్సీలను పంపగలరా..? దమ్ముందా..? ఇచ్చిన హామీలు అమలు ప్రయత్నాలు మానేసి రాజ్యసభ స్థానాల కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తున్నారు.

దేశంలో మత్స్యకారుడుని రాజ్యసభకు పంపిన ఏకైక వ్యక్తి జగన్. వైసీపీ పడినా లేచినా జగన్ తోనే. 2029లో కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో రోజుకో మానభంగం జరుగుతుంటే హోం మంత్రి ఏం చేస్తున్నారు..? శాంతిభద్రతలు గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మంత్రిగా ఉన్నా.. గతంలో మాదిరి గాలితనంతో మాట్లాడితే ఎలా..? మోపిదేవి, బీద మస్తాన్ లు ఏం లేదని వెళ్లిపోయారు..? ఇక్కడ లేనిదల్లా అధికారం మాత్రమే. కష్టాలు భరించడానికి ఓర్పు ఉండాలి. రాజకీయాల్లో అవకాశవాదం పెరుగుతూనే ఉంటుంది. అవకాశవాదులు ఉంటూనే ఉంటారు.

Also Read : ముంబై నటికి వేధింపుల కేసు.. పోలీసులకు చంద్రబాబు ప్రభుత్వం కీలక ఆదేశం

అనేక అభియోగాలున్న ఓ మహిళను ప్రధాన పాత్రగా పెట్టి కొందరు పోలీసు అధికారులపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఆ మహిళపై ఉత్తర భారత దేశంలో అన్ని రాష్ట్రాల్లో చెప్పడానికి ఇబ్బంది పడే కేసులు ఉన్నాయి. ఐపీఎస్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడం కోసం ఇంత డ్రామా చేస్తున్నారు. 2014 నుండి పార్టీ గుమ్మం ఎక్కని వ్యక్తిని మాకు ఆపాదిస్తున్నారు. ఈ ఘటన జరిగింది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా. మాకు అంటగడుతున్నారు” అని మండిపడ్డారు పేర్నినాని.