సినిమా ఇన్పిరేషన్ : 14 రేప్ లు..మర్డర్లు

పశ్చిమ గోదావరి : సినిమాలు నేరాలను ప్రోత్సహిస్తున్నాయా..సినిమాలలో చూపించే హింస..నేరాలకు ఉసిగొల్పుతున్నాయా అంటే..ఓ నేరస్థుడు నిజమేనంటున్నాడు. సినిమా చూసి ఇన్పిరేషన్ తోనే ఇన్ని రేప్ లు..మర్డర్లు చేసానంటు చెప్తున్న నేరస్థుడి విచారణలో పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.
జిల్లాలోని కామవరపుకోట సమీపంలోని బౌద్ధారామాల వద్ద జరిగిన శ్రీధరణి (18) హత్య కేసులో నిందితుడైన పొట్లూరు రాజును విచారణలో వెల్లడైన నమ్మలేని నిజాలివి.’దండుపాళ్యం’ సినిమాను చూసి కామ పిశాచిగా మారిన రాజు సైకోగా మారి ..కనిపించిన ప్రేమ జంటలపై దాడులు చేశాడని..ఇప్పటివరకూ 14 మందిపై అత్యాచారం చేయడంతో పాటు వారిలో నలుగురిని హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు పొట్లూరి రాజును విచారించిన అనంతరం అతను చేసిన దాష్టీకాలు అన్నీ ఇన్నీ కావని..ఎన్నో దుర్మార్గాలను కళ్లారా చూసిన తకు కూడా రాజు చేసిన అఘాయిత్యాలు వింటుంటే గగుర్పాటు కలిగించాయని ఈ సందర్భంగా పోలీసు అధికారులు వెల్లడించడం గమనార్హం.
పోలీసుల వివారాలతో నిందితుడి చరిత్ర..నేర చరిత్ర ఇలా
కృష్ణాజిల్లా మైలవరం మండలం చండ్రాల గ్రామానికి చెందిన పొట్లూరు రాజు..పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. తరువాత కొత్తపల్లికి మకాం మార్చాడు..జీడితోటలకు కాపలాకాస్తూ, పక్షులు, జంతువులను వెంటాడుతూ తిరుగుతుంటాడని..తనకు ఎదురైన ప్రేమ జంటలపై దాడి చేసి డబ్బులు గుంజుతుండాడని తెలిపారు. అంతేకాదు..సదరు ప్రేమ జంటలో యువతి తనకు నచ్చితే, యువకుడిని చావగొట్టి..ఆమెపై అత్యాచారం చేస్తాడని తెలిపారు.ఈ క్రమంలో ప్రేమజంట ఎదురు తిరిగితే దారుణంగా హతమారుస్తాడని చెప్పారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన ఈ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు తెలిపారు.