బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి.. బర్డ్ ఫ్లూ వల్ల ఓ మనిషి ప్రాణాలు కోల్పోవడం ఏపీలో ఇదే మొదటిసారి.. ప్రభుత్వం అప్రమత్తమై..
నమూనాలను పలు స్థాయుల్లో పరీక్షించి బర్డ్ ఫ్లూ మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.

Bird Flu
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్ ఫ్లూతో ఓ చిన్నారి (2) మృతి చెందింది. బర్డ్ ఫ్లూ వల్ల ఓ మనిషి ప్రాణాలు కోల్పోవడం ఆంధ్రప్రదేశ్‌లో ఇదే మొదటిసారి.
ఆ చిన్నారికి పచ్చి కోడి మాంసం తినే అలవాటు ఉందని డాక్టర్లు తేల్చారు. అలాగే, ఆ చిన్నారికి రోగ నిరోధక శక్తి కూడా తక్కువ ఉందని చెప్పారు. ఈ కారణాల వల్ల బర్డ్ ఫ్లూ సోకి, కోలుకోలేకపోయిందని తెలిపారు.
Also Read: వామ్మో.. ఎన్నడూ లేనంత ఎగబాకిన బంగారం ధర
ఆ చిన్నారి మృతిపై భారత వైద్య పరిశోధన మండలి కూడా స్పందించింది. బర్డ్ ఫ్లూ వల్లే మృతి చెందిందని నిర్ధారించింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బర్డ్ ఫ్లూపై అప్రమత్తం చేసింది. ఆ చిన్నారి గత నెల 16న మృతి చెందింది.
అనంతరం నమూనాలను పలు స్థాయుల్లో పరీక్షించి బర్డ్ ఫ్లూ మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ఆ చిన్నారి మరణంతో ఆంధ్రప్రదేశ్ సర్కారు అన్ని జిల్లాల్లోని వైద్య ఆరోగ్యశాఖ అధికారు లను అప్రమత్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ వల్ల వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. చికెన్‌ను బాగా ఉడికించాలని ఇప్పటికే అధికారులు సూచనలు చేశారు.