Gautam Gambhir : శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Gautam Gambhir : శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్

Gautam Gambhir visit Tirumala Srinivasulu

Updated On : September 28, 2023 / 10:46 AM IST

Gautam Gambhir – Tirumala Srinivasulu : తిరుమల శ్రీవారిని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ దర్శించుకున్నారు. సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంభీర్ కు ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. వరల్డ్ కప్ లో భారత్ గెలవాలని కోరుకున్నట్లు తెలిపారు.

దేశ ప్రజలందరూ భారత్ వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.

Tirumala Brahmothsavalu : తిరుమలలో వైభవంగా ముగిసిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

నిన్న (బుధవారం) శ్రీవారిని 66,336 భక్తులు దర్శించుకున్నారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.24 కోట్లు. శ్రీవారికి 21 వేల 774 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.