Bhuma Akhila Priya: తల్లైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

కర్నూలు జిల్లా తెలుగుదేశం నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మగబిడ్డకు జన్మనిచ్చారు.

Bhuma Akhila Priya: తల్లైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

Bhuma

Updated On : December 16, 2021 / 11:09 AM IST

Bhuma Akhila Priya: కర్నూలు జిల్లా తెలుగుదేశం నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త భార్గవ్ రామ్ నాయుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. భూమా అఖిలప్రియ తన బిడ్డతో ఉన్న ఫోటోను షేర్ చేసి, మగ బిడ్డ పుట్టినట్లుగా ప్రకటించారు.

భూమా అఖిల ప్రియ తల్లి శోభానాగిరెడ్డి జయంతి రోజునే అఖిలప్రియ కొడుకుకి జన్మనిచ్చారు. భూమా అఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలోనే భార్గవ రామ్‌ను పెళ్లి చేసుకోగా.. తర్వాతికాలంలో భూమా ఫ్యామిలీలో ఎన్నో వివాదాలు చోటుచేసుకున్నాయి. భూమా అఖిల, ఆమె భర్త భార్గవరామ్‌పై ఎన్నో కేసులు ఉన్నాయి.

తల్లి మరణంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన భూమా అఖిలప్రియ.. 2014లో వైసీపీ తరపున ఆళ్లగడ్డ నుంచి పోటీచేసి విజయం సాధించారు. తండ్రి నాగిరెడ్డి నంద్యాల నుంచి గెలవగా.. తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో ఇద్దరూ టీడీపీలో చేరారు.

భూమా నాగిరెడ్డి టీడీపీలో ఉన్న సమయంలోనే చనిపోగా.. అఖిల ప్రియక మంత్రి పదవి దక్కింది. 2019ఎన్నికల్లో మాత్రం ఆళ్లగడ్డ నుంచి పోటీచేసి అఖిలప్రియ ఓడిపోయారు.